దేశంలో ప్రధాని నరేంద్రమోడీ నీతివంతమైన పాలనకు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు
**దేశంలో ప్రధాని నరేంద్రమోడీ నీతివంతమైన పాలనకు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని పేర్కొన్నారు.తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతొందని,ప్రజా సంక్షేమాన్నీ మరిచి,ప్రజా ప్రతినిధులు దోచుకుంటున్నారని మండిపడ్డారు.బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా,గ్రామ స్థాయి నుండి పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాలు బడుగు,బలహీన వర్గాలకు మేలుచేకూరేలా ఉన్నాయని,ఆ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలని,ప్రజలకు లబ్ధి చేకూరేలా ముందుకు సాగాలన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని, ప్రతి గ్రామంలో బీజేపీ కార్యకర్త ప్రజలకు చెదోడువాదోడుగా ఉంటూ,ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్మల్ పట్టణంలోని మారుతి హోటల్ లో పార్టీ జెండాను ఆవిష్కరించి. జ్యోతి ప్రజ్వలన చేసి,జిల్లా అధ్యక్షులు పడకంటి రమాదేవి గారి అధ్యక్షత న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, రాష్ట్ర నాయకులు మహేష్ గారు,ఆదిలాబాద్ మాజీ ఎంపీ,బీజేపీ నేత రమేష్ రాథోడ్ గారు, బీజేపీ పెద్దపెళ్లి ఇంచార్జి రావుల రాంనాథ్ గారు, సీనియర్ నాయకులు అయ్యన్నగారి భూమన్న గారు, జిల్లా కార్యదర్శులు సామ రాజేశ్వర్ రెడ్డి గారు,మెడిసెమ్మె రాజు గారు,పడిపెళ్లి గంగాధర్ గారు, నిర్మల్ అసెంబ్లీ నాయకులు కొరిపెళ్లి శ్రవణ్ రెడ్డి గారు, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు సాధం అరవింద్ గారు, జడ్పీటీసీ భూక్య జానుభాయ్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు పడాల రాజశేఖర్ గారు, కమల్ నయన్ గారు .మహిళా మోర్చా స్రవంతి గారు, నాయకులు సైండ్ల శ్రీధర్ గారు, తదితరులు, మండల, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Comments
Post a Comment