కాబోయే కోడలి గురించి షాకింగ్ నిజాలు.. పెళ్లి రద్దు.. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్..!
గ్వాలియర్: ఓ యువతికి ఎంచక్కా పెళ్లి కుదిరింది. అంతా సవ్యంగా జరిగిపోతోందని అందరూ అనుకుంటుండగా.. వరుడి కుటుంబానికి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి మీకు కాబోయే కోడలు ఇప్పటికే వేరే వ్యక్తి సొంతమైంది అని చెప్పాడు. అలాగే ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉన్నట్లు చెప్పాడు. దీంతో ఆగ్రహించిన వరుడి కుటుంబం.. పెళ్లి రద్దు చేసుకుంది. ఇది జరిగిన వెంటనే ఆ యువతి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎదురింట్లో ఉండే గగన్ యాదవ్ అనే యువకుడిపై ఫిర్యాదు చేసింది. అసలేం జరిగిందా అని ఆరా తీయగా పోలీసు దర్యాప్తులో పూర్తి విషయం బయటపడింది. ఐదేళ్ల క్రితం సదరు యువతికి, వారి ఎదురింట్లో ఉండే గగన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొంతకాలం స్నేహం చేసిన తర్వాత గగన్.. ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. దీనికి ఆ అమ్మాయి కూడా సరేనంది.
అమ్మాయి కూడా అంగీకరించడంతో ఈ యువతీయువకులు సరదాగా కాలం వెళ్లదీశారు. వీరి బంధం మరింత ముదిరి శారీరక సంబంధం వరకూ దారి తీసింది. ఇలా అప్పటి నుంచి వీళ్లిద్దరూ అడపాదడపా తమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని గగన్‌ను ఆమె కోరింది. దీనికి అతను ససేమిరా అన్నాడు. ఎందుకు చేసుకోవంటూ ఒత్తిడి చేయడంతో అసలు విషయం బయటపడింది. అదేంటంటే.. ఆ అతనికి అప్పటికే పెళ్లి అయిపోయింది. ఈ నిజం తెలిసి షాకైన యువతి.. వెంటనే అతనితో తన బంధాన్ని తెగతెంపులు చేసుకుంది. వేరే పెళ్లికి సిద్ధమైంది. ఆమె కుటుంబం సిటీలో ఉండే వేరే యువకుడితో ఆమెకు పెళ్లి నిశ్చయం చేశారు. ఈ విషయం తెలిసిన గగన్.. వెంటనే అబ్బాయి కుటుంబానికి ఫోన్ చేసి, కాబోయే కోడలి ఎఫైర్ గురించి మొత్తం చెప్పేశాడు. ఈ కథంతా తెలిసిన అబ్బాయి కుటుంబం సంబంధాన్ని రద్దు చేసుకుంది. దీంతో గ్వాలియర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సదరు యువతి.. గగన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Comments
Post a Comment