Skip to main content
హైదరాబాద్ లో ఇల్లు కొన్న సోనూసూద్
కరోనా కష్టకాలంలో రియల్ హీరోగా అవతరించాడు సోనూసూద్. ఇప్పుడు ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకరోవాలని ఆరాటపడుతున్నారు. తెలుగులో ఆయనకు విరివిగా అవకాశాలొస్తున్నాయి. ఈనేపథ్యంలో ఎక్కువ కాలం హైదరాబాద్ లోనే ఉండాల్సివస్తోంది. హైదరాబాద్ ఎప్పుడొచ్చినా పార్క్ హయత్ హోటెల్ నే ఆయన అడ్డా. ఇప్పుడు సోనూ సూద్ కేరాఫ్ మారుతోంది. హైదరాబాద్ లో ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా బంజారా హిల్స్‌లో.. రూ.10 కోట్లతో ఓ ఖరీదైన ఇంటికి కొనుగోలు చేసినట్టు సమాచారం. త్వరలోనే గృహ ప్రవేశం చేయబోతున్నారు. సోనూకి ముంబైలో ఓ ఇల్లు ఉంది. ఆయన అక్కడే ఉంటారు. కానీ.. తెలుగు సినిమాల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ కొత్త ఇంట్లో మకాం పెడతారు. సోనూ వ్యక్తిగత వ్యవహారాలు, సామాజిక సేవ, కథా చర్చలకు ఇప్పుడు ఈ కొత్త ఇల్లు ఉపయోగపడనుంది.
Comments
Post a Comment