అందరం ప్రార్థిద్దాం.. అతను బతకాలని, సోనూ సూద్ పిలుపు

 

సోనూసూద్ మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న యువ‌కుడి ప్రాణాల‌ను బ‌తికించేందుకు ప్రార్థిద్దాం అని అభిమానుల‌కు పిలుపునిచ్చారు. ఢిల్లీకి చెందిన హితేశ్ శ‌ర్మ అనే యువ‌కుడు ఈ ఏప్రిల్ నుంచి క‌రోనాతో పోరాడుతున్నాడు. అత‌ని ఊపిరితిత్తులు కూడా దెబ్బ‌తిన్నాయి. ఈ విష‌యం తెలుసుకున్న సోనూసూద్‌.. అత‌న్ని ప్రాణాల‌తో కాపాడేందుకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా నిన్న ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు తీసుకొచ్చారు.


న‌గ‌రంలోని య‌శోద ఆస్ప‌త్రిలో శ‌ర్మ‌కు ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జ‌రీ జరుగుతోంది. ఈ క్రమంలో సోనూసూద్ ట్వీట్ చేశారు. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకొచ్చిన హితేశ్ శ‌ర్మ‌కు య‌శోద ఆస్ప‌త్రిలో లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జ‌రీ జరుగుతోంది. అతను ఏప్రిల్ నుంచి క‌రోనాతో పోరాడుతున్నాడని..పేర్కొన్నారు. ఆ యువ‌కుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డాల‌ని మ‌నంద‌రం ప్రార్థించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిమానుల‌కు సోనూసూద్ పిలుపునిచ్చారు.

Comments