Viral Video: జోరువానలో కల్లాపి చల్లుతున్న యువతి.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!
సోషల్ మీడియా ప్రపంచం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి...
Viral Video: జోరువానలో కల్లాపి చల్లుతున్న యువతి.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!
సోషల్ మీడియా ప్రపంచం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక నెట్టింట్లో చక్కర్లు కొట్టే కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొన్ని క్యూట్‌గా మనసుకు ప్రశాంతతను ఇచ్చే విధంగా ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో ఓ అమ్మాయి చేసిన పని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది.
అసలే వర్షాకాలం..పైగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నంతగా కుండపోత వర్షం పడుతోంది. కానీ, ఇదిగో ఇక్కడ ఈ అక్క మాత్రం జోరువానలో తాపిగా కల్లాపి జల్లుతోంది. ఓ వైపు ఇంటి ముందు నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తుండగా, ఈ అమ్మాయి మాత్రం.. ఇలా వాకిట్లో నీళ్లు జల్లుతోంది. ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది.
కాగా, వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓర్నీ ఇదేంటక్క పైనుంచి కిందకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉందిగా, ఇలాంటి టైమ్‌లో ప్రత్యేకించి వాకిట్లో నీళ్లు జల్లడం ఎందుకు..? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుండగా, అక్క మండిపోయే ఫ్రస్టెషన్‌లో ఉందేమో..? అంటూ మరికొందరు నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

Comments
Post a Comment